సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ.. హాజరైన సినీ ప్రముఖులు వీరే

సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ.. హాజరైన సినీ ప్రముఖులు వీరే

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వేదికగా ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజు ఆధ్వర్యంలో వీరు సీఎంతో సమావేశమయ్యారు. మురళీమోహన్, నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు సహా 36 మంది సినీ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ భేటీలో ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి వెంకట రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీ సహా మరికొందరు అధికారులు హాజరయ్యారు.

హాజరైన సినీ ప్రముఖులు వీరే

హీరోలు

  • నాగార్జున
  • వెంకటేష్
  • నితిన్
  • రామ్ పోతినేని
  • వరుణ్ తేజ్ 
  • సాయి ధరమ్ తేజ్
  • కళ్యాణ్ రామ్ 
  • శివ బాలాజీ
  • అడవి శేష్
  • కిరణ్ అబ్బవరం
  • సిద్ధూ జొన్నలగడ్డ

డైరెక్టర్లు

  • కొరటాల శివ
  • అనిల్ రావిపూడి
  • కె రాఘవేంద్ర రావు
  • వంశీపైడిపల్లి
  • ప్రశాంత్ వర్మ
  • సాయి రాజేశ్
  • హరీశ్ శంకర్
  • వీరశంకర్
  • త్రివిక్రమ్
  • వేణు శ్రీరామ్
  • వేణు(బలగం)
  • విజయేంద్ర ప్రసాద్
  • పవర్ బాబీ

నిర్మాతలు

  • దిల్ రాజు
  • అల్లు అరవింద్
  • సురేష్ బాబు
  • మురళీ మోహన్
  • బివీఎస్ఎన్ ప్రసాద్
  • డీవీవీ దానయ్య
  • సుధాకర్ రెడ్డి
  • సి.కళ్యాణ్ 
  • గోపి ఆచంట
  • శ్యాంప్రసాద్ రెడ్డి
  • బీవీఎస్ ప్రసాద్ 
  • కె.ఎల్ నారాయణ 
  • మైత్రీ రవి
  • మైత్రీ నవీన్
  • రమేష్ ప్రసాద్ 
  • భరత్ భూషణ్ (తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు) 
  • దామోదర్ ప్రసాద్ (తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు)