వెలుగు, బషీర్ బాగ్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న నుమాయిష్లో ఫేమస్సింగర్సునీత సందడి చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన మ్యూజికల్ నైట్లో తన పాటలతో అలరించారు. ఉర్రూతలూగించే ఆమె పాటలకు యువత కోరస్ ఇస్తూ ఎగ్జిబిషన్గ్రౌండ్ను హోరెత్తించారు. అనంతరం సునీతను సొసైటీ సభ్యులు సన్మానించారు.