ప్రతి చిన్న విషయానికి జనాలు ఆవేశానికి గురవుతున్నారు. ఒక్కోసారి ఈ ఆవేశం కట్టలు తెగి.. హత్యలకు దారితీస్తుంది. కుత్భుల్లాపూర్ ... దుండిగల్ పరిధిలో సెల్ ఫోన్ చార్జర్ కోసం ఓ యువకుడు మహిళను చంపిన కేసును పోలీసులు రెండు చేధించారు.. వివరాల్లోకి వెళ్తే...
కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి దుండిగల్ తండా రెండు రోజుల క్రితం శుక్రవారం ( ఆగస్టు 23) నాడు జరిగిన జరుపాల శాంతి అనే మహిళ హత్య కేసును 48 గంటలలో ఛేదించిన పోలీసులు...నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్ కు తరలించారు.
దుండిగల్ పీఎస్ పరిది తండా లో కల్లు మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాపు నిర్వహించే శాంత(50) తన దుకాణం పక్కన రెండు రోజుల క్రితం విగతజీవిగా పడి ఉంది. గమనించిన స్థానికులు సమాచారం అందించగా పోలీసులు వెళ్లి చూడగా గాయాలపాలై విగతజీవిగా ఉంది. మొదటగా ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ... తరువాత శాంతిని ఎవరో హత్య చేసినట్లుగా అనుమానించారు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి రావుల కమల్ కుమార్ ఆమెను హత్య చేసినట్లుగా గుర్తించారు. కమల్ కుమార్ గ్రామ సమీపంలోగల ఆల్ట్రాక్లీన్ సర్వీసెస్ కంపెనీలో మెయింటెనెన్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. సిసి కెమెరాల ఆధారంగా నిందితుడు కమల్ కుమార్ ను గాగిల్లాపూర్ xరోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
నిందితుడు .. మృతురాలితో మొబైల్ చార్జర్ కోసం గొడవపడ్డాడని..మృతురాలు శాంత అసభ్య పదజాలం దుర్బాషలాడడంతో నిందితుడు కొట్టి తోయడంతో కిందపడి గాయాల పాలై అరుస్తుండంతో.. అరవకుండా ఉండేందుకు భయంతో నోరు మూయడంతో ఆమె ఊపిరి ఆడక మరణించిందని తెలిపాడు. ఈ మేరకు నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్లు మేడ్చల్ డి.సి.పి తెలిపారు.