భారీగా తగ్గనున్న సెల్ఫోన్ ధరలు..దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

భారీగా తగ్గనున్న సెల్ఫోన్ ధరలు..దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

సెల్ ఫోన్ ప్రియులకు శుభవార్త.. ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ పై కేంద్ర ప్రభుత్వం దిగుమంతి సుంకాల తగ్గించడంతో సెల్ ఫోన్ ధరలు తగ్గే అవకాశం ఉంది. దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ల దిగుమతి సుంకాన్ని తగ్గించింది.  ప్రస్తుతం 15 శాతం ఉన్న దిగుమతి సుంకం రేట్లను 10 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.  

బ్యాటరీ కవర్స్, లెన్స్, బ్యాక్ కవర్స్, ఇతర మెకానికల్ వస్తువుల వంటి  మొబైల్ ఫోన్ల విడి భాగాలకు దిగుమతి సుంకం వర్తిస్తుంది. అంతేకాదు హై ఎండ్ మొబైల్ ఫోన్ల తయారీకి కీలకమైన కాంపొనెంట్స్ పై ప్రత్యేకంగా దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

మొబైల్ తయారీ రంగంలో ప్రపంచానికి పోటీదారుగా భారత్ ను నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోందని ఇండియన్ సెల్యూలార్  అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) చైర్మన్ పంకజ్ మొహింద్రు తెలిపారు.ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో  కొన్నేళ్ల క్రితం 9వ స్థానంలో ఉన్న భారత్.. 2024లో 5 వ స్థానానికి చేరుకుందని వెల్లడించారు.  ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 52 శాతానికి పైగా మొబైల్స్ ఉన్నాయి. గత 8ఏళ్లలో ఎలక్ట్రానిక్స్ ను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుందని పంకజ్ మెహింద్రో అన్నారు. 

హై-ఎండ్ మొబైల్ ఫోన్‌ల తయారీకి కీలకమైన కాంపోనెంట్స్‌పై ప్రత్యేకంగా దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత్ పరిశీలిస్తోంది. దిగుమతి సుంకాల తగ్గింపు మొబైల్ ఫోన్ పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సెల్ ఫోన్ల తయారీలో ప్రపంచ మార్కెట్ తో భారత్ గట్టి పోటీ ఇవ్వనుందని.. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.