యాదగిరిగుట్ట ప్రధాన ఆలయంలోకి సెల్ఫోన్స్ నిషేదం

యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్లు నిషేదిస్తూ ఏప్రిల్ 8న  ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్టిరియల్ సిబ్బంది, మతపర సిబ్బంది, నాల్గో తరగతి సిబ్బంది, ఎస్ పీఎఫ్, హోంగార్డ్స్ , అవుట్ సోర్సింగ్, సిబ్బంది వారి సెల్ ఫోన్లు ఆలయంలోకి  తీసుకెళ్లడాన్ని నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆలయంలో విధులు నిర్వర్తించేటపుడు సిబ్బంది ఎవరూ కూడా  తమ సెల్ ఫోన్లు తీసుకుని వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ పిఎఫ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.