సిమెంట్ ​ఇటుక తలపై పడి కార్మికుడు మృతి

సిమెంట్ ​ఇటుక తలపై పడి కార్మికుడు మృతి

జీడిమెట్ల, వెలుగు: సిమెంట్​ఇటుక తలపై పడడంతో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలానికి చెందిన తమిటీ నాయకుడు (48) ఉపాధి కోసం సిటీకి వలస వచ్చి దూలపల్లిలో ఉంటున్నాడు. భవన నిర్మాణ రంగంలో గోవా కర్రలు కడుతూ జీవనం సాగిస్తున్నాడు.  ఈ క్రమంలో దూలపల్లిలోని సహస్ర కన్​స్ట్రక్షన్​వద్ద బుధవారం గోవా కర్రలను విప్పుతుండగా, మరో కార్మికుడు ఐదో అంతస్తు నుంచి సిమెంట్​ఇటుకను కిందపడేశాడు. అది నాయకుడు తలపై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.