
బెల్లంపల్లి రూరల్, వెలుగు: డ్యూటీకి వెళ్తున్న ఓ కార్మికుడిపై కోతులు దాడి చేయగా, వాటిని తప్పించుకునే క్రమంలో కింద పడి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. తమకు న్యాయం చేయాలంటూ డెడ్‌బాడీతో కంపెనీ గేటు ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా కాసీపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన మేకల రాకేశ్ (48) స్థానికంగా గల ఓరియంట్ సిమెంట్ కంపెనీ వర్క్‌షాప్‌లో పర్మినెంట్ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నాడు.
గత నెల 8న డ్యూటీకి వెళ్తుండగా కంపెనీ ఆవరణలోని కంప్రెషర్హౌజ్ సమీపంలో థర్డ్ ప్లాంట్ మార్గంలో రాకేశ్‌పై కోతులు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో హ్యాండ్ రేల్ ఫెడ్ స్టాల్ మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తోటి కార్మికులు కంపెనీ డిస్పెన్సరీలో ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం మంచిర్యాల హాస్పిటల్‌కు తరలించారు.
రాకేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆదివారం రాత్రి చనిపోయాడు. దీంతో కార్మికుడి ఫ్యామిలీకి న్యాయం చేయాలంటూ డెడ్‌బాడీతో కంపెనీ గేట్ ఎదుట నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న దేవాపూర్ ఎస్సై ఆంజనేయులు కంపెనీ వద్దకు చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో కంపెనీ ఆఫీసర్లతో మాట్లాడి కార్మికుడి ఫ్యామిలీకి రావాల్సిన బెనిఫిట్స్‌తో పాటు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్, యూనియన్ నాయకులు తిరుపతిరెడ్డి, స్థానిక నాయకులు మెరుగు శంకర్, రమణ, ఆడె జంగు, వడ్లూరి మల్లేశ్, షకీర్పాల్గొన్నారు.