
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్(Ranveer singh) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ(Rocky Aur Rani Ki Prem Kahani). దాదాపు ఏడేళ్ల విరామం తరువాత కరణ్ జోహార్(Karan johar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. ఆలియా భట్(Alia bhat) హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇందులో భాగంగా ఈ సినిమాను సెన్సార్ కు పంపించారు మేకర్స్. అయితే ఈ సినిమాలోని చాలా విషయాల పట్ల సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిందట. ఈ సినిమాలోని సన్నివేశాలు, సంభాషణలతో పాటు కొన్ని రాజకీయ పరమైన అంశాల మీద కూడా తీవ్రంగా హెచ్చరించారట సెన్సార్ సభ్యులు. సినిమాలు ఇందుకోసం చేస్తున్నారు. ఇలాంటి అశ్లీల అశ్లీల పదాలతో యువతకు ఎం చెప్పాలనుకుంటున్నారు. అలాంటి పదాలు తెప్ప మీకు ఇంకేమా దొరకలేదా అంటూ మండిపడిందట సెన్సార్.
అలాగే ఆ సన్నివేశాలని మార్చాలని చిత్ర యూనిట్ ను ఆదేశించారట. రీసెంట్ టైం లో సెన్సార్ బోర్డు ఇంతలా సీరియస్ అయిన సినిమా ఇదే కావడం విశేషం. ఇక అభ్యంతరాలు తెలిపిన వాటిని తొలగించిన ఈ సినిమాను జులై 28న విడుదల చేయనున్నారు మేకర్స్.