Raayan: ధనుష్ రాయన్ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలకు నో ఎంట్రీ సెన్సార్ సర్టిఫికెట్

Raayan: ధనుష్ రాయన్ మూవీ పెద్దలకు మాత్రమే.. పిల్లలకు నో ఎంట్రీ  సెన్సార్ సర్టిఫికెట్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) 50వ సినిమా నేడు జూలై 26న థియేటర్లోకి వచ్చింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో ఫ్యామిలీతో సహా చూడాలనుకునే వారికి బిగ్ కండిషన్ గుర్తుంచుకోవాలని బుక్ మై షో తెలిపింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుంచి "A" సర్టిఫికెట్ జారీ చేయబడింది. ఈ క్రమంలో "A" సర్టిఫికెట్ పొందిన సినిమాల్లో ఎక్కువగా  హింసాత్మక దృశ్యాలు, కొన్ని నగ్నత్వం సన్నివేశాలు, దూషించే భాష అన్నీ ఉంటాయి.

ఈ మేరకు రాయన్ సినిమాను కేవలం 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే చూసే అవకాశం ఉంది. అయితే, ఎవరైనా 18 ఏళ్లకు తక్కువ వయస్సు ఉన్న టికెట్స్ బుక్ చేసుకుంటే మాత్రం హాల్ లోకి ఎంట్రీ లేకపోవడంతో పాటుగా డబ్బులు తిరిగి ఇవ్వబడదని బుక్ మై షో వెల్లడించింది.కాగా..ప్రేక్షకులు దయచేసి థియేటర్‌కి చెల్లుబాటు అయ్యే ID/వయస్సు ప్రూఫ్ ని తీసుకెళ్లండి.

సినిమా అనేది కాలక్షేపం కాదు.. మన సంస్కృతిలో, మన జీవన విధానంలో ఒక భాగం. ఏ ఇద్దరు ఒక్కచోట చేరినా, నలుగురు కుటుంబసభ్యులు సంతోషంగా మాట్లాడుకోవాలన్నా అవి ఒక్క సినిమా విశేషాలే. పలనా సినిమా బాగుందని, పాటలు బాగున్నాయని, పలనా హీరో బాగా నటించాడని ఏదో ఒక అంశం చర్చకు వస్తూనే ఉంటుంది. మరి ఇంకేంటి అంటారా! ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. అదే ఏ సినిమా ఎవరు చూడాలని..? అదేంటి సినిమా అంటే అందరూ చూడచ్చు కదా అనుకోకండి..! కొన్నిటికి పిల్లలు దూరంగా ఉండాలి.. మరికొన్నిటికి పెద్దలు దూరంగా ఉండాలి. అదెలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. 

భారతదేశంలోని ఏ సినిమా అయినా ప్రదర్శించడానికి ముందు CBFC నుండి సర్టిఫికేట్ పొందాలి. లేనిచో ప్రదర్శించకూడదు. భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) ఇష్యూ చేస్తుంది. 

U, U/A, A, S సర్టిఫికెట్ల మధ్య తేడా..

'U' సర్టిఫికేట్: అనియంత్రిత పబ్లిక్ ఎగ్జిబిషన్ అంటే ఎవరైనా దీన్ని చూడవచ్చు. సినిమా కథ, సన్నివేశాలు కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటాయని అర్థం. హింస లేదా నగ్నత్వ సన్నివేశాలు ఉండవనమాట. 

'U/A' సర్టిఫికేట్: ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది. 

'A' సర్టిఫికేట్: ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.

'S' సర్టిఫికేట్: ఈ సినిమాలు వైద్యులు లేదా శాస్త్రవేత్తల వంటి వారి కోసం తీస్తారు.

ఉదాహరణకు U, U/A, A సర్టిఫికేట్ వచ్చిన సినిమాలు: 

దంగల్‌: 'U', 
అర్జున్ రెడ్డి, రాగిణి MMS 2: 'A',
వార్‌: 'U/A'

ఇకపోతే, రాయాన్ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మొదలు ట్రైలర్ వరకు హింసాత్మక సన్నివేశాలు, పోస్టర్స్ ఉండటం గమనార్హం. అలాగే ప్రతి పోస్టర్ లో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి భీకరంగా కనిపిస్తున్నాడు.ఇక అతని వెనుక ఉన్న హీరో సందీప్ కిషన్ మరియు కాళిదాస్ జయరామ్ చేతిలో కత్తులు ఉన్నాయి.  రాయాన్ పోస్టర్ లోనే ఇంత హింస చూపిస్తుంటే..ఇక టీజర్ ట్రైలర్ కూడా ఎక్కువ చూపించారు. అందుకే సినిమా చూడటానికి పెద్దలకు మాత్రం అనుమతి ఉందని గుర్తుంచుకుని వెళ్ళండి,.