వృద్ధ దంపతులకు వందేండ్ల వేడుక

వృద్ధ దంపతులకు వందేండ్ల వేడుక
  • వృద్ధ దంపతులకు వందేండ్ల వేడుక 
  • పెండ్లి జరిపించిన  కుటుంబసభ్యులు 
  • వంద కిలోల కేక్ ​కట్చేయించి సంబురాలు
  • పాల్గొన్న 300 మంది బలగం 

కౌడిపల్లి, వెలుగు: వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న వృద్ధ దంపతులకు...కుటుంబసభ్యులు శతాబ్ది వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్ పల్లి గ్రామానికి చెందిన వాజ్జ నాగయ్యకు 105 ఏండ్లు కాగా ఇతడి భార్య సుగుణమ్మకు బుధవారంతో 100 ఏండ్లు నిండాయి. ఈ సందర్భంగా వీరి కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు, మునిమనుమలు కలిసి తునికి నల్ల పోచమ్మ ఆలయం వద్ద వేడుక నిర్వహించారు.

 ఇద్దరికీ సంప్రదాయబద్దంగా మళ్లీ పెండ్లి జరిపించారు. ఒకరి తలపై మరొకరు జీలకర్ర, బెల్లం పెట్టుకుని మురిసిపోయారు. తర్వాత ప్రత్యేకంగా వంద కిలోల కేకు తయారు చేయించి వృద్ధ దంపతులతో కట్ చేయించారు. నాగయ్య, సుగుణమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు కాగా మొత్తం బలగం అంతా కలిపి సుమారు 300 మంది వరకు ఉన్నారు.