ఫేక్ పాస్పోర్ట్ వెబ్సైట్ల లిస్టు ప్రకటించిన కేంద్రం

ఫేక్ పాస్ పోర్ట్ వెబ్సైట్లకు సంబంధించి కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఆయా వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించింది. ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్స్, అపాయింట్ మెంట్ షెడ్యూలింగ్ కు సంబంధించిన సేవలు అందిస్తామంటూ కొన్ని వెబ్ సైట్లు, యాప్స్ జనాన్ని మోసం చేస్తున్నాయని అలాంటి వాటిని నమ్మవద్దని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ తన అధికారిక వెబ్ సైట్లో మాత్రమే పాస్ పోర్ట్ అప్లై చేసుకునే సౌకర్యం కల్పించిందని కేంద్రం చెప్పింది. www.passportindia.gov.in వెబ్ సైట్ మాత్రమే దేశవ్యాప్తంగా పాస్ పోర్ట్ సర్వీసులు అందిస్తుందని స్పష్టం చేసింది. దేశంలోని 36 పాస్ పోర్ట్ ఆఫీసులు, విదేశాల్లోని 190 కేంద్రాల ద్వారా మాత్రమే విదేశాంగ శాఖ దేశ పౌరులకు పాస్ పోర్టులు మంజూరు చేస్తోందని చెప్పింది.
కేంద్రం ప్రకటించిన నకిలీ పాస్పోర్ట్ వెబ్సైట్ల లిస్టు ఇదే..

www.indiapassport.org

www.online-passportindia.com

www.passportindiaportal.in

www.passport-india.in

www.passport-seva.in

www.applypassport.org