![పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. రాష్ట్రం నుంచి ఇద్దరు కళాకారులకు పద్మశ్రీ](https://static.v6velugu.com/uploads/2024/01/center-announced-padma-awards-on-occasion-of-republic-day_qxBr2SRIQL.jpg)
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా 2024 పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రంగాల్లో ప్రతిష్టాత్మక, అసాధారణ సేవలు అందించినందుకు గాను భారత రత్న, పద్మ విభూషన్, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరిస్తుంది.
ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవకి పద్మ విభూషన్ అవార్డు ప్రకటించింది కేంద్రం. చిరంజీవితో పాటు వెంకయ్యనాయుడు, వైజయంతిమాల లకు పద్మవిభూషణ్ దక్కింది. మొత్తం ఐదుగిరికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించారు.బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు ప్రతిష్టాత్మక భారత రత్న లభించింది.
ఈ ఏడాది మొత్తం 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. తెలంగాణలోని జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్పలకు పద్మశ్రీ అవార్డు లభించింది. తెలంగాణకు చెందిన వేలు ఆనందాచారినిపద్మశ్రీ వరించింది.
మరోవైపు ఏపీకి చెందిన హరికథ కళాకారిణి డి. ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డు లభించింది. వీరితోపాటు దేశంలోనే తొలి మహిళా మావటి పార్వతి బారువా, అసోంకు చెందిన జగేశ్వర్ యాదవ్ లతో పాటు 110మందికి ఈ అవార్డును ప్రకటించింది కేందం.
పద్మశ్రీ2024 విజేతలు
కళల విభాగం
- గడ్డం సమ్మయ్య - తెలంగాణ
- దాసరి కొండప్ప - తెలంగాణ
- డి. ఉమా మహేశ్వరి -ఆంధ్రప్రదేశ్
- జానకీలాల్ - రాజస్థాన్
- గోపీనాథ్ స్వైన్ -ఒడిశా
- స్మృతి రేఖ ఛక్మా -త్రిపుర
- ఓం ప్రకాశ్ శర్మ - మధ్యప్రదేశ్
- నారాయణన్ ఈపీ - కేరళ
- భాగవత్ పదాన్ -ఒడిశా
- సనాతన్ రుద్ర పాల్ -పశ్చిమ బెంగాల్
- భద్రప్పన్ ఎం -తమిళనాడు
- జోర్డాన్ లేప్చా-సిక్కిం
- మచిహన్ సాసా - మణిపూర్
- శాంతిదేవీ పాసవాన్, శిన్ పాసవాన్ -బిహార్
- రతన్ కహార్-పశ్చిమ బెంగాల్
- అశోక్ కుమార్ బిశ్వాస్ -బీహార్
- బాలకృష్ణన్ సాధనమ్ పుథియా వీతిల్- కేరళ
- బాబూ రామ్ యాదవ్ -ఉత్తర ప్రదేశ్
- నేపాల్ చంద్ర సూత్రధార్-పశ్చిమ బెంగాల్
సామాజిక సేవా విభాగం
- పర్బతి బారువా- తొలి మహిళా ఏనుగు మావటి (అసోం)
- చామీ ముర్ము- ప్రఖ్యాత గిరిజన పర్యావరణ వేత్త (జార్ఖండ్)
- సంగంకిమా - మిజోరాం కు చెందిన సామాజిక కార్యకర్త (మిజోరాం )
- జగేశ్వర్ యాదవ్ -గిరిజన సంక్షేమ కార్యకర్త (ఛత్తీస్ గఢ్)
- గుర్విందర్ సింగ్ -సిర్సాకు చెందిన దివ్యాంగ్ సామాజిక కార్యకర్త (హర్యాన)
వైద్య విభాగం
- ప్రేమ ధనరాజ్ - ప్లాస్టిక్ సర్జన్ , సామాజిక కార్యకర్త (కర్ణాటక)
- యాజ్డీ మానేక్ష ఇటాలియా-మైక్రో బయలాజిస్ట్ (గుజరాత్)
- హేమ చంద్ మాంఝీ- మెడిసినల్ ప్రాక్టీషనర్ (చత్తీస్ గఢ్)
ఇతర విభాగాలు
- సత్యానారాయణ బేలేరి- వరి రైతు (కేరళ)
- దుఖ మాఝీ- గిరిజన పర్యావరణ వేత్త
- చెల్లమ్మాళ్- అండమాన్ (సేంద్రీయ రైతు)
- యానాంగ్ జమోహ్ లెగో- అరుణాచల్ ప్రదేశ్
- సోమన్న- గిరిజన సంక్షేమ కార్యకర్త
- సర్బేశ్వర్ బాసుమతరీ -గిరిజన రైతు (అసోం)
క్రీడా విభాగం
- ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే- అంతర్జాతీయ మల్లా ఖాంబ్ కోచ్ (మహారాష్ట్ర)