తెలంగాణకు రూ.245.96 కోట్ల వరద సాయం ప్రకటించింది కేంద్రం. గతంలో ఇచ్చిన ఎన్టీఆర్ఎఫ్ నిధులకు అదనంగా ఈ నిధులు మంజూరు చేసింది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం ప్రకటించింది. విపత్తు నిర్వహణ కింద ఐదు రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.1751.05 కోట్లు రిలీజ్ చేసింది. ఇందులో అసోంకు రూ.437.15 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ కు రూ. 75.86కోట్లు, ఒడిశాకు రూ.320.94 కోట్లు, యూపీకి 386.06 కోట్లు మంజూరు చేసింది.
see more news