
ఏపీలోని విజయనగరం జిల్లాలో నిన్న (అక్టోబర్ 29) జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ప్రమాదంలో 32 మందికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాకు కేంద్రప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి.
ఏపీ లో ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు పీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది.
Also read :- కామెంట్లు పెట్టి, షేర్ చేస్తే..రూ. 1,500
విజయనగరం సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షల చొప్పున సాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.