జీఆర్ఎంబీ చైర్మన్​గా ఏకే ప్రధాన్

జీఆర్ఎంబీ చైర్మన్​గా ఏకే ప్రధాన్

హైదరాబాద్, వెలుగు:గోదావరి రివర్​మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) కొత్త చైర్మన్​గా ఏకే ప్రధాన్​ను కేంద్రం నియమించింది. సెంట్రల్​వాటర్ ​ఇంజనీరింగ్​సర్వీస్ (గ్రూప్​ఏ)లో సీనియర్​ అడ్మినిస్ట్రేటివ్ ​గ్రేడ్​ (ఎస్ఏజీ) ఆఫీసర్​గా ఉన్న ఆయన్ను.. అదే సర్వీస్​లో హయ్యర్​అడ్మినిస్ట్రేటివ్​గ్రేడ్ (హెచ్ఏజీ)గా ప్రమోట్​ చేసింది. 

ఈ మేరకు బుధవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అనిల్​కుమార్​శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జీఆర్ఎంబీ చైర్మన్​గా ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే, జీఆర్ఎంబీ చైర్మన్​గా వ్యవహరించిన ముకేశ్ కుమార్ ​సిన్హాను ఈ నెల13న కేంద్రం సీడబ్ల్యూసీ చైర్మన్​గా నియమించిన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా ఆ పోస్ట్​ ఖాళీగా ఉంది. 

ఇటు జీఆర్ఎంబీ ఉద్యోగులపై బోర్డు మెంబర్​సెక్రటరీ అళగేశన్ తీరు కూడా వివాదస్పదమైంది. దీనిపై ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు, సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ సమస్య మరింత ముదరకుండా ఉండేందుకే కేంద్రం బోర్డుకు చైర్మన్​ను నియమించిందని అధికారులు చెబుతున్నారు.