ఉద్యోగం పోయినోళ్లకి డబ్బు సాయమే మేలు

న్యూఢిల్లీ:  కరోనా ఎంతో మంది ఉద్యోగులను రోడ్డున పడేసింది. మానసికంగానే కాకుండా, ఆర్థికంగానూ ఎంతో దెబ్బతీసింది. ఇంకా ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల రూ.25 వేల కంటే తక్కువ జీతం పొందుతూ ఉద్యోగం పోగొట్టుకున్న వారందరికీ కేంద్రం క్యాష్ రూపంలో సాయం అందించాలని సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ కోరారు. ‘ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి కేంద్రం క్యాష్ ట్రాన్స్‌‌‌‌ఫర్ చేయడం ప్రారంభించాలి. రూ.25 వేల కంటే తక్కువ జీతం ఉన్న వారి ఉద్యోగాలే ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి. వీరి జీతంలో 50 శాతం లేదా 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి’ అని కొటక్ తెలిపారు. లోన్‌‌‌‌ రీపేమెంట్లపై బ్యాంక్‌‌‌‌లు ఇస్తోన్న ఆరు నెలల మారటోరియంపై వడ్డీ ఎత్తివేయాలనే ప్రతిపాదన ఫైనాన్షియల్ సిస్టమ్‌‌‌‌ను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. కరోనా వైరస్ లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో ఆర్థికంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ అన్ని లోన్లపై ఆరు నెలల మారటోరియం సౌకర్యం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మారటోరియం సౌకర్యం కల్పిస్తూనే.. ఈఎంఐలపై వడ్డీని మాత్రం వసూలు చేస్తున్నారు.

లేబర్, ల్యాండ్ సంస్కరణలపై ప్రభుత్వం ఫోకస్ చేయాలని, ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌‌‌ను ప్రభుత్వం మరింత మెరుగుపరచాలని సూచించారు. అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో, చైనా నుంచి బయటకి వచ్చేస్తున్న వ్యాపారాలను ఇండియా ఆకర్షించాలని, దీని కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌‌‌ ఇంకా బాగుండాలని  చెప్పారు. కరోనా మహమ్మారితో ఇండియాలో పలు అవకాశాలు పుట్టుకు వచ్చాయని, ప్రభుత్వం ఇప్పటికే ఆత్మ నిర్భర్ భారత్‌‌‌‌ను తీసుకొచ్చినట్టు తెలిపారు.  కార్పొరేట్ ట్యాక్స్‌‌‌‌లను కూడా ప్రభుత్వం తగ్గించిందన్నారు. ‘ప్రస్తుతం చైనాకు, అమెరికాకు ట్రేడ్ వార్ జరుగుతోంది.  చైనా నుంచి ఇండియాకు వ్యాపారాలను తీసుకురావడానికి ఇదే సరియైన సమయం. ల్యాండ్, లేబర్ సంస్కరణలను తీసుకురావాల్సి ఉంది’ అని ఉదయ్ కొటక్ తెలిపారు.

బ్యాంక్‌‌‌‌లకు మరింత క్యాపిటల్ కావాలి…

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌‌‌‌లకి మరింత క్యాపిటల్‌‌‌‌ను అందించేందుకు కేంద్రం సిద్ధం కావాలని ఉదయ్ కొటక్ అన్నారు. బ్యాంక్‌‌‌‌ల బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేయాలన్నారు. క్యాపిటల్‌‌‌‌తో ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌‌‌లకు సపోర్ట్ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తాను నమ్ముతున్నట్టు కొటక్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొండి బకాయిలు, ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీలు అకస్మాత్తుగా కుప్పకూలడం, బ్యాంక్ బెయిల్‌‌‌‌అవుట్‌‌‌‌లు మార్చి నెలలో ఇండియన్ బ్యాంక్‌‌‌‌లను బలహీనపరిచాయని ప్పారు. క్రెడిట్ సూయెజ్‌‌‌‌ గ్రూప్ ఏజీ రిపోర్ట్ ప్రకారం, బ్యాంక్‌‌‌‌లు 20 బిలియన్ డాలర్ల క్యాపిటల్‌‌‌‌ను సేకరించాల్సి ఉంది. దీనిలో ప్రభుత్వ బ్యాంక్‌‌‌‌లకే  13 బిలియన్ డాలర్లు కావాల్సి ఉంటుంది.

కరోనా కాలంలో మార్కెట్ మోడలే బెటర్..

ఫైనాన్సియల్ మార్కెట్ల ద్వారా ఆకట్టుకోవడానికి మన దేశ సంస్థలకు ఇదే కరెక్ట్ టైమ్ అని కొటక్ చెప్పారు. బ్యాంకింగ్ సెక్టార్ నుంచి లోన్లు కోరుకునే వారికి, ఫైనాన్షియల్ మార్కెట్లు ఒక బ్యాకప్‌‌గా పేర్కొన్నారు. ఈ కరోనా సంక్షోభంలో బ్యాంక్ మోడల్ కంటే, మార్కెట్ మోడలే చాలా బాగా పర్‌‌‌‌ఫార్మ్ చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది బాండ్స్ సేల్ ద్వారా మన దేశ సంస్థలు రూ.3.83 లక్షల కోట్లను సమీకరించాయి. గతేడాది ఇదే కాలంలో రూ.3.62 లక్షల కోట్లను పొందాయి. ఈక్విటీ జారీ ద్వారా రూ.67,800 కోట్లు సేకరించాయి. సీఐఐ ప్రెసిడెంట్‌‌గా ఇండియన్ కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌‌ను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని కొటక్ తెలిపారు. షాడో బ్యాంక్‌‌ల సంక్షోభంలో ప్రతిపాదిత సొల్యుషన్స్‌‌ను అమలు చేయడంలోనూ ఉదయ్‌‌ కొటక్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.