మూడు రాజధానులకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయం బోగస్‌ విధానమన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు. రాజధాని విషయంలో ఏపీకి కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని..కేంద్రం అనుమతితోనే అంతా జరుగుతోందని వస్తున్న కథనాలు కల్పితాలేనన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనే అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని జీవీఎల్‌ స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే ప్రభుత్వం ఎందుకు కేసులో పెట్టలేదని..అక్రమార్కులను  YCP ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందా అని ప్రశ్నించారు.

మరోవైపు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పై కూడా ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి అంటున్నారని..తమ తప్పును కేంద్రంపై రుద్దాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు ఏళ్లలో చంద్రబాబు… నాలుగు పక్కా బిల్డింగ్ లు కట్టలేకపోయారని ఆరోపించారు జీవీఎల్‌.