రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. MSP పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. MSP పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: దీపావళి పండుగ వేళ రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే రబీ సీజన్‎కు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంపునకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన అధ్యక్షతన 2024, అక్టోబర్ 16న కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కుమార్ మీడియాకు వివరించారు.  రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే రబీ సీజన్ కనీస మద్దతు ధర కోసం రూ.87,657 కోట్లు కేటాయింపునకు మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

ALSO READ | అదృష్టం బాగుంది: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ హెలికాఫ్టర్ పొలాల్లో దిగింది..!

 

 గోధుమలు క్వింటాల్‌పై రూ.150,  ఆవాలు క్వింటాల్‌పై రూ.300,  శెనగలు క్వింటాల్‌పై రూ.210 పెంచినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపుతో పాటు.. వారణాసిలో రైల్‌-రోడ్‌ బ్రిడ్జి నిర్మాణానికి కేబినెట్ అప్రూవల్ తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ.2,642 కోట్లతో వారణాసిలో గంగానదిపై రైల్‌-రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. పండుగ వేళ డీఏ పెంపుతో ఉద్యోగులు, కనీస మద్దతు ధర పెంచడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.