టీటీడీకి కేంద్రం గుడ్ న్యూస్..

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్రం భారీ ఊరట ఇచ్చింది. తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించే  కరెన్సీకి బ్యాంక్ లలో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఫారెన్ కరెన్సి సమర్పించిన దాతలు వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపునిచ్చింది. భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కొనాలని కోరింది   సెక్షన్ 50 ప్రకారం  టీటీడీకి మాత్రమే ఈ అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవోకు సమాచారం ఇచ్చింది. 

గతంలో విదేశీ కరెన్సీ డిపాజిట్లు వ్యవహరంలో టీటీడీకి 3 కోట్ల జరిమాన విధించింది కేంద్రం. భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీ విషయంలో ది ఫారెన్ కంట్రిబ్యూషన్  రెగ్యులేషన్  యాక్ట్( FCRA) నిబంధనలు ఉల్లింఘించినందుకు  ఫైన్ విధించింది. జరిమాన చెల్లించిన అనంతరం విదేశీ కరెన్సీ డిపాజిట్లు  చేసుకునేందుకు లైసెన్స్ రెన్యూవల్ చేసింది కేంద్రం.అయితే విదేశీ  కరెన్సీ డిపాజిట్ చేసే సమయంలో దాతల వివరాలు తెలపాలన్న నిభందనను సడలించని కేంద్రం.. తాజాగా టీటీడీ  విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది.