![తెలంగాణకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్](https://static.v6velugu.com/uploads/2023/03/Begumpet-Airport_d8mWPJqyTs.jpg)
తెలంగాణకు ప్రధాని మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 400 కోట్లతో బేగంపేట ఎయిర్ పోర్ట్ లో పౌరవిమానయాన పరిశోధన కేంద్రం(CARO) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలోనే తొలిసారి 5జీ టెక్నాలజీతో ఈ కేంద్రం నిర్మిస్తున్నారు. 2023 జులై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే లక్ష్యంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైటెక్ టెక్నాలజీతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటుచేసుకోనున్న సాంకేతిక మార్పులపై ఇందులో పరిశోధనలు జరగనున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే టార్గెట్ గా పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి.
పౌరవిమానయాన పరిశోధన కేంద్రంలో
1. విమానాశ్రయాలు, ఎయిర్ నావిగేషన్ సేవలకు సంబంధించిన పరిశోధనా సౌకర్యాలు
2. ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్స్
3. డొమైన్ సిమ్యులేటర్స్
4. నెట్ వర్క్ ఎమ్యులేటర్
5. విజువలైజేషన్ & అనాలసిస్ ల్యాబ్స్
6. సర్వెలెన్స్ (నిఘా) ల్యాబ్స్
7. నావిగేషన్ సిస్టమ్స్ ఎమ్యులేషన్ & సిమ్యులేషన్ ల్యాబ్స్
8. సైబర్ సెక్యూరిటీ & థ్రెట్ అనాలసిస్ ల్యాబ్స్
9. డేటా మేనేజ్‌మెంట్ సెంటర్
10. ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్
11. సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ & టూల్స్ సెంటర్
12. నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ వంటి ఈ పౌరవిమానయాన పరిశోధనా కేంద్రం (CARO) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్, 2023 లోగా ఈ కేంద్రం సేవలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.