వంటనూనెలపై దిగుమతి సుంకం పెంపు

న్యూఢిల్లీ: ముడిచమురు, శుద్ధి చేసిన వంటనూనెలపై  కేంద్రం ప్రాథమిక దిగుమతి పన్నును 20 శాతం పెంచింది. నూనె గింజల ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్న రైతులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ చర్య వంటనూనెల ధరలను,  డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గిస్తుంది. పామాయిల్, సోయా ఆయిల్,  సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులూ తగ్గుముఖం పడతాయి.  కేంద్రం ఈ మూడు నూనెలపై మొత్తం దిగుమతి సుంకాన్ని 5.5 శాతం నుంచి 27.5 శాతానికి  పెంచింది. మనదేశానికి భారీగా శుద్ధి చేసిన పామాయిల్, శుద్ధి చేసిన సోయా ఆయిల్,  శుద్ధి చేసిన సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతుంది.