కేంద్రం మిషన్ కాకతీయకు ఎలాంటి సాయం చేయలేదు

మిషన్ కాకతీయకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు మంత్రి హరీశ్ రావు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మిషన్ కాకతీయ కింద 14 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు చెప్పారు. మిషన్ కాకతీయపై నేషనల్ జియోగ్రఫి ఛానల్ డాక్యూమెంటరీ రూపొందించిందని చెప్పారు. ఈ పథకం ద్వారా రైతులకు మేలు జరిగిందన్నారు. మిషన్‌కాకతీయ పథకానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత లక్షా 17వేల 714పోస్టులు భర్తీ చేశామని… మరో 31,668 పోస్టుల నియామకాల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. పోస్టుల భర్తీకి సంబంధించి 900 కేసులు కోర్టుల్లో ఉన్నాయని తెలిపారు మంత్రి హరీశ్ రావు.