కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరున్నరేళ్లలో తెలంగాణకు కేంద్రం అణా పైసా కూడా సహాయం చేయలేదన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. విభజన చట్టంలో తెలంగాణ, ఏపీకి పారిశ్రామిక రాయితీలు కేంద్రం ఇస్తానని చెప్పి, ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర సర్కారు ఇప్పటికయినా ప్రత్యేక రాయితీలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు పార్లమెంట్‌లో చేసిన చట్టాన్నే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా ఎవరికి కూడా రూపాయి ప్రయోజనం కలగలేదని చెప్పారు మంత్రి కేటీఆర్. కేంద్రం ప్యాకేజీతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని...వీధి వ్యాపారులకు మాత్రమే రూ.10 వేల రుణాలు ఇచ్చారని వివరించారు.