CAA ఆందోళనలపై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వం సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. హింసను ప్రేరేపించేలా తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపైనా, సోషల్ మీడియా పోస్టులపైనా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచించింది. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకంగా నిరసనలు చేస్తుండగా… అవి రెండు రోజుల క్రితం ఢిల్లీ, హైదరాబాద్‌కూ పాకాయి. ఢిల్లీలో జేఎంఐ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం ఈ సూచనలు చేసింది.