పసుపు రైతులకు గుడ్ న్యూస్

పసుపు రైతులకు జనవరిలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతుందన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పసుపు దిగుమతి నిలిపేయాలని  కోరగా..అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. అరవింద్ గట్టి నెగోషియేటర్ అన్న విషయం నిరూపిస్తానన్నారు. పసుపు జాతీయ స్థాయిలో సాగుచేసే పంట కాదని.. అయినా సరే పసుపు పంటకు మద్ధతు ధర కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.  అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు పంపాలన్నారు.. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్ధతు ధరపై ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్నారు.