హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్మహేశ్ కుమార్ గౌడ్ఆరోపించారు. ఎప్పుడు అమలు చేస్తారో తెలియని బిల్లును హడావుడిగా ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. త్వరలో రానున్న ఎన్నికలకు మహిళా బిల్లును అమలు చేస్తేనే బీజేపీ చిత్తశుద్ధి బయటపడుతుందన్నారు.
బిల్లులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన కోటా లేదని, అందుకే రాహుల్ గాంధీ బీసీల అంశాన్ని లేవనెత్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని 90 సెక్రటరీల్లో కేవలం ముగ్గురే బీసీలున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీసీ కులగణనకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినఆరు గ్యారెంటీలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతున్నదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే హామీలను అమలు చేస్తామని తెలిపారు.