
కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కేంద్రం స్పందించింది. ఆ 400 ఎకరాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఈ మేరకు తెలంగాణ అటవీ శాఖకు లేఖ రాసింది కేంద్ర పర్యావరణ శాఖ. HCUలో పర్యావరణానికి విఘాతం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అక్కడ చెట్లు, జంతుజాలానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచించింది. నిజానిజాలపై విచారణ సాగించి పూర్తి నివేదికను అందించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిని కోరింది కేంద్ర అటవీ పర్యావరణ శాఖ.
మరో వైపు కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. పిటిషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ రవి చంద్ వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 54 ను రద్దు చేయ్యాలని కోరుతున్నారు.
కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని ప్రభుత్వం తెలిపింది. సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఒక్క అంగుళం భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని వెల్లడించింది. విద్యార్థులు రాజకీయ పార్టీల ట్రాప్ లో పడొద్దని సూచించింది.