న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) స్కాం నిందితుడు మెహుల్ ఛోక్సీ కేసులో కేంద్రం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఛోక్సీని తిరిగి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందు లో భాగంగా డొమినికా హైకోర్టు విచారణలో కేంద్రం,సీబీఐ ఇంప్లీడ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పీఎన్బీ స్కాంకు సంబంధించి సీబీఐ, పౌరసత్వాని కి సంబంధించి విదేశాంగ శాఖ వాదనలు వినిపించనున్నట్లు సమా చారం. ఛోక్సీ హెబీయస్ కార్పస్ అభ్యర్థనపై సీబీఐ డొమినికా కోర్టు లో ‘ఇంప్లీడ్మెంట్’ అప్లికేషన్ దాఖ లు చేసింది. పీఎన్బీ స్కాం కేసు వివరాలను కోర్టు ముందుంచాలని సీబీఐ ప్రయత్నిస్తోంది. ఇక విదేశాంగ శాఖ మరో పిటిషన్‌ను డొమినికా హైకోర్టులో దాఖలు చేసింది. ఛోక్సీ ఇంకా ఇండియనే అని.. అతడి పాస్‌పోర్టు సమర్పిం చలేదని అందులో పేర్కొంది. ఈ పిటిషన్‌ను డొమినికా హైకోర్టు ఆమోదిస్తే.. మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్‌సాల్వే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారు.