ట్యాపింగ్​పై కేంద్రం విచారణ జరిపించాలి : గూడూరు నారాయణ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ తమిళిసై ఫోన్ ట్యాప్ చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రెడ్‌‌‌‌‌‌‌‌హిల్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ జరుగుతోందని, ఇందుకోసం ఇంటెలిజెన్స్ పోలీసులు ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారని ఆరోపించారు. ఫోన్​ ట్యాపింగ్​పై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 

ఫోన్లను ట్యాప్ చేయాలంటే అనుమతులు తప్పనిసరి అని, గతంలో ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాప్​ చేసి ప్రభుత్వాలే పడిపోయాయని గుర్తుచేశారు. టీఆర్ఎస్  ప్రభుత్వ అక్రమాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ విచారణకు ఆదేశించాలని, ట్యాపింగ్ చేస్తున్న ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఫోన్​నే ట్యాప్ చేస్తే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ భయంతో బతుకుంతోందని.. అందుకే సొంత పార్టీ నేతలపై కూడా నిఘా పెట్టిందని ఆరోపించారు.