
న్యూఢిల్లీ, వెలుగు: కాశ్మీర్ లో టూరిస్ట్ లపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈ నెల 27న కేంద్రం కీలక భేటీ నిర్వహించనుంది. లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోదీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానితోపాటు హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, నేషనల్ డిఫెన్స్ అడ్వైజర్, మరో ఇద్దరు ముఖ్య అధికారులు పాల్గొనున్నట్లు సమాచారం.
ఈ భేటీ లోపు కాశ్మీర్లో టెర్రరిస్ట్ ల ఏరివేత చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లో తలదాచుకొన్న ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ మాదిగానే పీవోకేలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మరో స్ట్రైక్స్ కోసం కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది.