ట్విట్టర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: ట్విట్టర్ సంస్థకు కేంద్రం మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. 1178 ట్విట్టర్ ఖాతాలను బ్లాక్‌ చేయాలని  ట్విట్టర్ ను కేంద్రం కోరింది. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతుల ట్రా‍క్టర్‌ ర్యాలీలో హింసకు కారణమైన.. ప్రేరేపించిన వారిని గుర్తించి సదరు ట్విట్టర్‌ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని లెటర్ రాసింది. తీవ్రవాద ఖలీస్తాన్ సానుభూతి పరులు, పాకిస్తాన్ తో లింకులున్న  ఖాతాలను బ్లాక్ చేయాలని కోరుతూ ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ  నివేదిక మేరకు ఐటీ  మంత్రిత్వ శాఖ  ఈ నోటీసులు జారీ చేసింది. ఈ అకౌంట్లులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నాయని కేంద్రం ఆరోపణ.

ఇవి కూడా చదవండి..

ఉచిత తాగునీటి పథకం.. క్షేత్రస్థాయిలో అంతా గందరగోళం

కోడ్ కూస్తదేమోనని.. పనుల్లో స్పీడ్.. క్వాలిటీ అడగొద్దు

సీఎం ఎంట్రీతో సీన్​ మారేనా?