వివాదానికి చెక్.. మన్మోహన్ సింగ్ స్మారక స్థూపం ఏర్పాటుపై కేంద్రం కీలక ప్రకటన

వివాదానికి చెక్.. మన్మోహన్ సింగ్ స్మారక స్థూపం ఏర్పాటుపై కేంద్రం కీలక ప్రకటన

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నాం ఏర్పాటుపై నెలకొన్న పొలిటికల్ వివాదానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం  ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకానికి సంబంధించిన వాస్తవాలు’’ అనే పేరుతో ప్రకటన విడుదల చేసిన హోంశాఖ.. మన్మోహన్ సింగ్ స్మారక స్థూపానికి ప్రత్యేక స్థలం కేటాయించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

 స్థలం కేటాయింపు విషయంపై ఖర్గే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. రాజనీతిజ్ఞులను స్మారక చిహ్నాలతో గౌరవించే సంప్రదాయానికి అనుగుణంగా.. స్మారక చిహ్నంతో పాటు ప్రత్యేక స్థలంలో సింగ్ అంత్యక్రియలు నిర్వహించాలని ఖర్గే రిక్వెస్ట్ చేశారు. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం మొదట తిరస్కరించింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. దేశ తొలి సిక్కు ప్రధాని, ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుండి దేశాన్ని గట్టెక్కించిన మన్మోహన్ సింగ్‎ను బీజేపీ అవమానించిందని కాంగ్రెస్ విమర్శలు వర్షం కురిపించింది. 

ALSO READ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు సోనియా, రాహుల్ నివాళులు

దీంతో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ స్మారక స్థూపం ఏర్పాటు కోసం ప్రత్యేక స్థలం కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని.. మరో మూడు  నాలుగు రోజుల్లో స్థలం కేటాయిస్తామని తెలిపింది. ఈ మేరకు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే  కేంద్ర ప్రభుత్వం సమాచారం అందించింది. ఇదిలా ఉండగా.. నిగమ్ బోథ్ ఘాట్‎లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాట్లు చేసింది.