
కొడంగల్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన నక్షా పైలట్సర్వే కొడంగల్ మున్సిపాలటీ సోమవారం నుంచి షురూ కానుంది. వ్యవసాయ సాగు భూముల మాదిరిగానే మున్సిపాలిటీల్లో కూడా పక్కాగా సర్వే చేసి నక్షా రూపొందిస్తారు. రెవెన్యూ, మున్సిపల్, సర్వే ఆఫ్ఇండియా విభాగాల ఆధ్వర్యంలో నక్షా సర్వే చేయనున్నట్టు కొడంగల్ తహసీల్దార్విజయ్కుమార్తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లు, ఖాళీ స్థలాలు, పట్టా భూములు, ప్రభుత్వ స్థలాల సర్వే చేసి హద్దులు, విస్తీర్ణాన్ని డిజిటల్పద్ధతిలో రూపొందించడం జరుగుతుందని వివరించారు. నక్షా సర్వే ద్వారా మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల అక్రమణలు వెలుగులోకి వచ్చే చాన్స్ కూడా ఉందని పేర్కొన్నారు. సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ఇప్పటికే కొడంగల్‌కు చేరుకుంది.