COW HUG DAY: ఫిబ్రవరి 14న ‘కౌ హగ్‌ డే’ బంద్

COW  HUG DAY: ఫిబ్రవరి 14న  ‘కౌ హగ్‌ డే’ బంద్

ప్రపంచ ప్రేమికుల దినోత్సవం రోజున దేశంలో ‘కౌ హగ్‌ డే’ని జరుపుకోవాలంటూ సెంట్రల్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇటీవల పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన పిలుపు చర్చనీయాంశంగా మారింది. దాంతో కౌ హగ్ డే పిలుపును తిరిగి వెనక్కి తీసుకున్నట్లు యానిమల్ వెల్ఫేర్ బోర్డు పేర్కొంది. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖల నుంచి అందిన ఆదేశాలే దీనికి కారణం అని బోర్డు కార్యదర్శి ఎస్ కే దత్తా వెల్లడించారు. 

కౌ హగ్ డే పిలుపుపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. సోషల్ మీడియాలో మీమ్స్ దగ్గరనుంచి రాజకీయ విశ్లేషకుల వరకు ఈ నిర్ణయాన్ని దెప్పిపొడిచారు. కౌ హగ్ డే పిలుపు హాస్యాస్పదమని శివ సేన వర్గం పేర్కొంది. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే కేంద్రం ఇలాంటి వాటికి పిలుపునివ్వడంపై కొన్ని పార్టీలు మండిపడ్డారు.