
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సెంట్రల్ ఆఫీస్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా మొత్తం 3000 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణలో 96 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్ లో 100 ఖాళీలు ఉన్నాయి. ఒక సంవత్సరం శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.15వేలు స్టైపెండ్ ఇస్తారు. 2024 ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు దరఖాస్తులు స్వీకరించబడును.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులకు సెలక్ట్ చేస్తారు. అప్లై ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.800, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్/ మహిళా అభ్యర్థులకు రూ.600.. దివ్యాంగులకు రూ.400గా నిర్ణయించారు.