![Jobs: సీబీఐలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు](https://static.v6velugu.com/uploads/2025/02/central-bank-of-india-credit-officer-recruitment-2025-apply-online-for-1000-posts_GgFlYUT152.jpg)
క్రెడిట్ఆఫీసర్ పోస్టుల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ) అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నది. ఈ పోస్టులను రెగ్యులర్ బేస్డ్గా భర్తీ చేస్తున్నారు. ఈ నెల 20లోగా అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు: క్రెడిట్ ఆఫీసర్1000 (జనరల్405, ఎస్సీ–150, ఎస్టీ –75, ఓబీసీ–270, ఈడబ్ల్యూఎస్–100), జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్/ స్కేల్–1.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో 60శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. కనిష్టంగా 20 ఏండ్లు, గరిష్టంగా 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీకి మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్: ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.750తోపాటు జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 ఫీజుతోపాటు జీఎస్టీ ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ల్లో ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ ఆవేర్ నెస్(రిలేటెడ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ) సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై రెండు ఎస్సే ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో దానికి 15 మార్కుల చొప్పున 30 మార్కులకు ఉంటుంది.