సెంట్రల్​ బ్యాంక్ రైటాఫ్​లు 7,856 కోట్లు

సెంట్రల్​ బ్యాంక్ రైటాఫ్​లు 7,856 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏ) గత ఏడాది జూన్​ క్వార్టర్​లో 14.9 శాతం నుంచి 4.95 శాతానికి పడిపోయాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-–జూన్ క్వార్టర్​లో బ్యాంక్ రూ.7,856 కోట్ల అప్పులను రైటాఫ్​చేయడమే ఇందుకు కారణం. 

ఇదేకాలంలో నికర ఎన్‌పీఏలు 3.93 శాతం నుంచి 1.75 శాతానికి తగ్గాయి. బ్యారోవర్ల నుంచి అప్పులను వసూలు చేసే అవకాశం లేనప్పుడు బ్యాంకులు అప్పులను రైటాఫ్​ చేస్తాయి. ఈ అప్పులను మాఫీ చేయవు కానీ ఖాతా పుస్తకాల నుంచి తొలగిస్తాయనే విషయం తెలిసిందే. 

ALSO READ:తెలంగాణలోనూ ఢిల్లీ తరహా విద్యావిధానం: సబితా ఇంద్రారెడ్డి