
కొత్తగా 100రూపాయలు, 200రూపాయల నోట్లు రాబోతున్నాయి. మహాత్మాగాంధీ కొత్త సిరీస్ లో ఈనోట్లు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ సంజయ మల్హోత్రా సంతకంతో త్వరలో ఈ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.
రూ. 100, రూ.200 నోట్ల జారీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.త్వరలో కొత్త గవర్నర్ సంతకంతో ఈనోట్లను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. మహాత్మాగాధీ కొత్త సిరీస్ లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంలో రూ.100, రూ.200 డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్నారు. మునుపటి నోట్ల మాదిరిగానా డిజైన్ ఉంటుంది.
గతంలో జారీ చేసిన రూ.100, రూ. 200 నోట్లు చెలామణి అవుతాయని తెలిపింది. గతంలో ఉన్న రూ.50 నోట్లను కూడా గవర్నర్ సంజయ మల్హోత్రా సంతకంలో విడుదల చేయనున్నారు. ఈ నోట్ల డిజైన్ కూడా మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ.50 నోట్లను పోలి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.