జగిత్యాలలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన సెంట్రల్ BSF బలగాలు

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ కోరారు. జగిత్యాల పట్టణంలో జిల్లాకు వచ్చిన BSF కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్ ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు రెండు BSF కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లాకు వచ్చాయని.. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని చూచించారు. 

ALS0 READ:  కాంగ్రెస్‌ హామీలు నీటిమూటలు : జగదీశ్ రెడ్డి