న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐలు) పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతామని బడ్జెట్ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇదివరకే ఇండియాలో పెట్టుబడి పెట్టిన బీమా కంపెనీలు ఎఫ్డీఐ పరిమితిని పెంచుకోవచ్చని చెప్పారు. ఎఫ్డీఐల కోసం ప్రస్తుతం ఉన్న కండిషన్లను మరింత సరళీకరిస్తామన్నారు.
ఎఫ్డీఐ పరిమితిని పెంచడానికి కేంద్ర బీమా చట్టం 1938, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం 1956, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్మెంట్అథారిటీ చట్టం 1999లో మార్పులు తేవాల్సి ఉంటుంది. బీమా రంగంలోకి మరిన్ని కంపెనీలు రావడం వల్ల ఎక్కువ మందికి బీమా ఫలాలు అందుతాయని, ఉద్యోగాలూ పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మనదేశంలో 25 లైఫ్ఇన్సూరెన్స్ కంపెనీలు, 34 నాన్–లైన్ ఇన్సూరెన్స్ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి.