కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. అసెంబ్లీలో కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఊసే లేకుండా బడ్జెట్ తయారు చేశారని విమర్శించారు. సమఖ్య స్పూర్తి దెబ్బతీసేల కేంద్రం బడ్జెట్ ఉందని ఆరోపించారు. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ లోనూ మనకు అన్యాయమే జరిగిందన్నారు. విభజన చట్టంలో 35 హమీలున్నయని వాటి ఊసే లేదని చెప్పారు.
ఏపీకి నిధులిస్తే మాకు అభ్యంతరం లేదని అన్నారు. తెలంగాణపై కేంద్రానికి ముమ్మాటికి వివక్షే ఉందన్నారు. మిత్రపక్షాలుగా ఉన్న బీహార్ ఏపీకే నిధులిచ్చారని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీధులివ్వాలని కోరినా ఇవ్వలేదన్నారు. తెలంగాణలోని ఒక్క టూరిజం ప్లేస్ ను కూడా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఫైనాన్స్ కమిషన్ సూచనలు కేంద్రం లైట్ తీసుకుందని విమర్శించారు.
తెలంగాణలో వెనకబడిన జిల్లాలకు నిధుల్లివ్వలేదని తెలంగాణకు ఐఐఎం అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. 16 జాతీయ రహదారులకు విజ్ఞప్తి చేశామని పీఎంను ఎన్నిసార్లు కలిసి చెప్పినా పట్టించుకోలుదన్నారు. కేంద్రం వివక్షపై ఎంపీలు ఎమ్మెల్యేలు స్పందించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులివ్వాలని కోరారు మంత్రి శ్రీధర్ బాబు.