దేశంలో ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కు నిధుల కేటాయింపులో కేంద్రం కోత పెట్టింది. 2023–24లో రూ.968.86 కోట్లు అలాట్చేయగా, ఈసారి రూ.951.46 కోట్లతో సరిపెట్టింది.
కిందటేడుతో పోలిస్తే సీబీఐకు 1.79 శాతం(17.4కోట్లు) నిధులు తగ్గించింది. కేటాయించిన మొత్తాన్ని సీబీఐకి సంబంధించిన శిక్షణా కేంద్రాల మోడ్రనైజేషన్, టెక్నికల్, ఫోరెన్సిక్ సపోర్ట్ యూనిట్ల స్థాపన, ల్యాండ్, ఆఫీసుల కొనుగోలు, వివిధ ప్రాజెక్టుల కోసం వినియోగించనున్నట్లు తెలిపింది.