
ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.
తాజాగా ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలుపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆదివాసీ ఆరాధ్య దైవాలు సమ్మక్క, సారలమ్మ పేరిట ములుగులో ఏర్పాటు కానన్న ఈ యూనివర్సిటీకి రూ.900 కోట్లు కేటాయిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.
Also Read :- బీహార్ను ఫాలో అవుతున్న ఒడిశా.. త్వరలోనే OBC జనగణనపై రిపోర్ట్ రిలీజ్
కాగా ఉమ్మడి ఏపీ విభజన సమయంలోనే.. ఏపీ, తెలంగాణలలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది.