ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీపై కొత్త ట్రిబ్యునల్..

ఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీపై కొత్త ట్రిబ్యునల్..

ఏపీ, తెలంగాణ కృష్ణా జలాల పంపిణీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ  వాటాలు తేల్చే అంశాన్ని బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్రం రిఫర్ చేసింది. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశాన్ని  బ్రజేశ్ ట్రిబ్యునల్ కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ALSO READ : ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసుకున్న భారత హాకీ టీం.. సెమీస్‌లో కొరియా చిత్తు

ఏపీ, తెలంగాణ  మధ్య కృష్ణా నీటి పంచాయితీలు తేల్చేందుకు  కొత్త నిబంధనలు రూపొందించాలని బ్రజేష్ ట్రైబ్యునల్ ను కేంద్రం ఆదేశించింది. కృష్ణా నదిలో జలాల్లో తమ వాటా తేల్చాలని తెలంగాణ కోరుతున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అందుకే  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య  కృష్ణా జలాల పంపిణీకి  కృష్ణా ట్రిబ్యునల్ ను  కేంద్రం ఆదేశించిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. 

ఏపీ విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని ఏపీ, తెలంగాణ పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేశారు.  ఇది తాత్కాలిక పంపిణీ మాత్రమే. ఆ తర్వాత  విభజన చట్టం కింద నీటి పంపకాలపై కేంద్రం  కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డే కృష్ణనది నీటిని రెండు రాష్ట్రాలకు పంచుతోంది. అయితే  కొత్తగా నీటి పంపకాలు చేపట్టాలని తెలంగాణ కేంద్రాన్ని కోరింది. గతంలో వెలువరించిన తీర్పుల సమయంలో తెలంగాణలేదు కాబట్టి.. తెలంగాణ వాదన వినేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని వాదించింది. అందుకోసం కొత్తగా ట్రిబ్యునల్ వేయాలని 2014లో కేంద్రానికి లేఖ రాసింది.  లేదంటే ఉన్న ట్రిబ్యునలే కొత్తగా నీటి పంపకాలు చేయాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం తెలంగాణ  డిమాండ్ ను అంగీకరించిన కేంద్రం.. కొత్త ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసింది.