ఇటీవల కుంగిన మేడిగడ్డ( లక్ష్మీ) బ్యారేజీను కేంద్ర కమిటీ పరిశీలిస్తోంది. CWC సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీ డ్యా్మ్ ను చేక్ చేస్తుంది. ఈ బృందంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ఇంజనీర్లు కూడా ఉన్నారు. బ్యారేజీ పటిష్టత, జరిగిన నష్టంపై కేంద్ర బృందం అంచనా వేయనుంది. కాగా బ్యారేజ్ మూడు నుంచి నాలుగు ఫీట్ల మేర కిందకు కుంగినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు శనివారం సాయంత్రం కుంగిపోయాయి. 6వ బ్లాక్‌లో 15 నుంచి 20 మధ్య ఉన్న పిల్లర్లలో కొన్ని కుంగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు బ్రిడ్జి షేప్ మారినట్టు కనిపిస్తోంది. మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్న సిబ్బంది.. గేట్ల నుంచి శబ్దాలు రావడంతో అలర్ట్ అయ్యారు.
రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ అత్యంత కీలకమైంది. గోదావరిలో ప్రాణహిత కలిసే చోటుకు 20 కిలోమీటర్ల దిగువన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్మండలంలోని అంబట్పల్లి వద్ద దీన్ని నిర్మించారు. 85 గేట్లతో నిర్మించిన ఈ రిజర్వాయర్ కెపాసిటీ 16.17 టీఎంసీలు. ప్రాణహితలో వచ్చే వరదను ఈ బ్యారేజీ నుంచే రివర్స్ పంపింగ్ ద్వారా ఎగువకు లిఫ్ట్ చేస్తారు.