భద్రాచలం,వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ధమ్తరీ జిల్లా నగరి పోలీస్ స్టేషన్ పరిధిలోని భైంసా ముండా అడవుల్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టును గుర్తించారు. కేంద్ర కమిటీ సభ్యుడు గణేశ్‌కు గన్‌మెన్‌గా వ్యవహరించే మడకం మంగళ్ అలియాస్ అశోక్‌గా పోలీసులు ప్రకటించారు. బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్కా గ్రామవాసి అని పోలీసులు తెలిపారు.
ఇతడిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. భారీగా మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్‌కు వెళ్లాయి. 20 మంది మావోయిస్టులు పోలీసులను చూసి కాల్పులు జరుపుకుంటూ పారిపోయారు. కాల్పులు ఆగిపోయాక ఘటనాస్థలానికి వెళ్లి చూడగా అశోక్ మృతదేహంతో పాటు 315 బోర్ తుపాకీ, మొబైల్ ఫోన్, రెండు బ్యానర్లు, విప్లవ సాహిత్యం కనిపించగా, వాటిని స్వాధీనం చేసుకున్నారు.