
ఇటీవల స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన 25,271 కానిస్టేబుల్ పోస్టుల అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయింది. ఇప్పటినుంచే టైమ్ మేనేజ్ చేసుకుంటూ అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగిస్తే సెంట్రల్ కానిస్టేబుల్ కొలువు సొంతం చేసుకోవచ్చు. త్వరలో ఎగ్జామ్ తేదీని కమిషన్ ప్రకటించనుంది. ఈలోపు గ్రౌండ్ ప్రాక్టీస్‌పై అభ్యర్థులు ఫోకస్ చేయాలి. ఎగ్జామ్ ప్యాట్రన్, సిలబస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ వారం తెలుసుకుందాం..
పదో తరగతితోనే పోలీస్ విభాగంలో చేరాలనుకునే అభ్యర్థులకు ఈ పారామిలటరీ బలగాల నోటిఫికేషన్ మంచి అవకాశం. ప్రత్యేక సందర్భాలు, విపత్తుల సమయంలో ఈ పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగుతాయి. ఈ ఉద్యోగాల భర్తీని కేంద్ర హోంశాఖ ఆదేశాలతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) చేపడుతుంది.
పోస్టుల వివరాలు: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్– 8464, ఎస్ఎస్బీ – 3806, ఐటీబీపీ –- 1431, ఏఆర్ –- 3785, ఎస్ఎస్ఎఫ్ –- 240
ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్ 3 స్థాయి వేతనం లభిస్తుంది
సెలెక్షన్ ప్రాసెస్:
కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ ఇలా ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఎగ్జామ్ డ్యురేషన్ గంటన్నర. జనరల్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు కటాఫ్ మార్క్స్ 35 శాతం కాగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 33 శాతం.
ఫిజికల్ టెస్ట్:
అభ్యర్థులు 24 నిమిషాల్లో 5 కి.మీ. పరుగు పూర్తి చేయాలి. మహిళలు 8.1/2 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగు పూర్తి చేయాలి. ఫిజికల్ స్టాండర్డ్‌లో టెస్టులో భాగంగా పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్ల పొడవు ఉండాలి. కొన్ని ప్రాంతాల వారికి మినహాయింపు ఉంటుంది. రోజు క్రమం తప్పకుండా గ్రౌండ్ వర్క్ చేయాలి.
సిలబస్
జనరల్ ఇంటెలిజెన్స్& రీజనింగ్: అనాలజీ, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, ఓరియెంటేషన్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్‌లు,అర్థిమెటిక్ రీజనింగ్, ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థిమెటిక్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ డికోడింగ్ల నుంచి ప్రశ్నలు వచ్చే చాన్స్ ఉంది.
జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్నెస్: చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, కరెంట్ ఎఫైర్స్తోపాటు అభ్యర్థి జనరల్ అవేర్నెస్ను పరీక్షించే స్థాయి ప్రశ్నలు ఇస్తారు. క్రీడలు, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫి, ఎకానమి, జనరల్ పాలిటీ, భారత రాజ్యాంగం, టెక్నాలజీ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
ఎలిమెంటరీ మ్యాథ్స్: సంఖ్యావ్యవస్థ, పూర్ణాంకాలు, దశాంశాలు, భిన్నాలు, ప్రాథమిక గణిత ప్రక్రియలు, పర్సంటేజీలు, నిష్పత్తి అనుపాతం, లాభ నష్టాలు, వడ్డీ, డిస్కౌంట్, కాలం–దూరం, కాలం–నిష్పత్తి, కాలం–పని తదితర బేసిక్ గణిత అంశాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు 4 నుంచి 10 వరకు అకడమిక్ బుక్స్ ప్రిపేరవ్వాల్సి ఉంటుంది.
ఇంగ్లిష్/హిందీ: ఇంగ్లిష్ లేదా హిందీ భాషలో అభ్యర్థికి ఉన్న అవగాహన స్థాయిని పరీక్షిస్తారు. బేసిక్ కాంప్రహెన్షన్‌పై ప్రశ్నలు ఉంటాయి.
ఎగ్జామ్ ప్యాటర్న్
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్క్స్
జనరల్
ఇంటెలిజెన్స్ 25 25
& రీజనింగ్
జనరల్ నాలెడ్జ్
& జనరల్ 25 25
అవేర్నెస్
ఎలిమెంటరీ 25 25
మ్యాథమెటిక్స్
ఇంగ్లిష్/హిందీ 25 25
మాక్ టెస్టులు కీ రోల్
ఎస్ఎస్సీ జీడీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ 100 మార్కులకు ఉంటుంది. 120 నిమిషాల సమయంలో పూర్తి చేయాలి. మిగతా పోటీ పరీక్షల తో పోల్చితే కొంత సమయం అదనంగా ఉన్నా, నెగెటివ్ మార్కింగ్ ఉన్నందున అభ్యర్థి ప్రతి ప్రశ్న జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఎగ్జామ్‌లో సమయం చాలా కీలకం కావున అభ్యర్థులు ఎక్కువగా మాక్ టెస్టులు, ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. దీంతో ఎగ్జామ్ హాల్లో టైమ్ మేనేజ్మెంట్పై అవగాహన వస్తుంది. మాక్ టెస్టులు ఎక్కువగా రాయడంతో ఏ సబ్జెక్టులో ఏ టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, క్వశ్చన్ అడిగే విధానం అర్థం అవుతుంది. సబ్జెక్ట్స్‌ను కరెంట్ ఎఫైర్స్‌తో లింక్ చేసి ప్రిపరేషన్ కొనసాగిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ప్రిపరేషన్ సమయంలో నోట్స్ రాసుకుంటే రివిజన్ ఈజీగా ఉంటుంది. టైమ్ మేనేజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే జాబ్ సొంతం చేసుకోవచ్చు.
-జి. ప్రశాంత్ రెడ్డి రామానుజన్ అకాడమీ వరంగల్