
కడెం, వెలుగు: కడెం ప్రాజెక్ట్‌ను శనివారం సెంట్రల్ డిజైన్స్ టీమ్, మెకానికల్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్లు రాజమ్మ, మురళీకృష్ణ, విద్యానంద్ పరిశీలించారు. ఇటీవల వరదల వల్ల దెబ్బతిన్న గేట్లు, కౌంటర్ వెయిట్స్, రోలర్స్, రోప్స్, గేర్ బాక్స్‌ను తనిఖీ చేశారు. వారి వెంట సీఈ శ్రీనివాస్, ఎస్‌ఈ సుశీల్‌కుమార్, ఈఈ విఠల్, ఇరిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు.
ప్రాజెక్ట్‌కు చెందిన 18 గేట్లలో 9 ఇండియన్ గేట్లు ఉన్నాయని, ఒక్కో గేటుకు 40 చొప్పున మొత్తం 360 బేరింగ్‌లు అవసరం అవుతాయని ఆఫీసర్లు వివరించారు. ఇవి మన వద్ద దొరకకపోతే జర్మనీ నుంచి తీసుకొచ్చేందుకు పైఅధికారులకు తెలియజేస్తామని సీఈ శ్రీనివాస్, ఎస్‌ఈ సుశీల్‌కుమార్ చెప్పారు.