లోక్ సభ ఎన్నికల్లో.. రూ. 10 వేల కోట్ల విలువైన సరుకు సీజ్: ఈసీ

లోక్ సభ ఎన్నికల్లో.. రూ. 10 వేల కోట్ల విలువైన సరుకు సీజ్: ఈసీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో 10 వేల కోట్ల రూపాయల విలువైన సరుకు సీజ్ చేయటం జరిగిందని ప్రకటించారు కేం ద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్. 2019 ఎన్నికలతో పోల్చితే ఇది 3 వేల 475 కోట్లు అదనం అని వెల్లడించారాయన. 2024, జూన్ 3వ తేదీ ఢిల్లీలోని విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. 

  • మొత్తం పట్టుబడిన సరుకు విలువ రూ. 10 వేల కోట్లు
  • ఒక వెయ్యి 54 కోట్ల రూపాయలు నగదు సీజ్ 
  • పట్టుబడిన మందు (లిక్కర్) విలువ రూ.898 కోట్లు 
  • పట్టుబడిన బంగారం, వెండి విలువ ఒక వెయ్యి 459 కోట్ల రూపాయలు
  • పట్టుబడిన ఉచితాలు కింద పార్టీలు రెడీ చేసిన వస్తువుల విలువ 2 వేల 198 కోట్ల రూపాయలు
  • ఎన్నికల సమయంలో పట్టుబడిన డ్రగ్స్ విలువ 4 వేల 391 కోట్ల రూపాయలు

2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి సీజ్ చేసిన ఆయా వస్తువులు, నగదు విలువ 10 వేల కోట్ల రూపాయలు అని.. గత అన్ని ఎన్నికల కంటే ఇది చాలా ఎక్కువ అని వెల్లడించారాయన. పటిష్ఠమైన నిఘా వల్లే ఇది సాధ్యం అయ్యిందన్నారు.