జమ్మూకాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఆగస్టు 16, 2024 న షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18,25, అక్టోబర్ 1న మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్ లో 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
ఫేజ్ 1
- ఎన్నికల నోటిఫికేషన్ - ఆగస్టు 20
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేది -ఆగస్టు 27
- నామినేషన్ల పరిశీలన - ఆగస్టు 28
- నామినేషన్ ఉపసంహరణ ఆగస్టు 30
- మొదటి దశ ఎన్నికల తేదీ సెప్టెంబర్ 18
ఫేజ్ 2
- ఎన్నికల నోటిఫికేషన్ - ఆగస్టు 29
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేది -సెప్టెంబర్ 5
- నామినేషన్ల పరిశీలన - -సెప్టెంబర్ 06
- నామినేషన్ ఉపసంహరణ -సెప్టెంబర్ 09
- రెండో దశ ఎన్నికల తేదీ -సెప్టెంబర్ 25
ఫేజ్ 3
- ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 05
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేది సెప్టెంబర్12
- నామినేషన్ల పరిశీలన - సెప్టెంబర్13
- నామినేషన్ ఉపసంహరణ సెప్టెంబర్17
- చివరి దశ ఎన్నికల తేదీ అక్టోబర్ 1
మరో వైపు అక్టోబర్1న ఒకే దశలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈరెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 4,2024న ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.